- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Guinness World Record: ప్రపంచ రికార్డు సాధించిన 108 ఏళ్ల.. వయసులో కాదు!

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో శక్తి నశిస్తూ ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో అయితే 40 ఏళ్లు వచ్చాయంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఈ క్రమంలో వందేళ్లు దాటిన వారు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కులుగా గిన్నిస్ రికార్డు సాధించటం చూస్తుంటాం. ఇక ఇదే తరహాలో 108 ఏళ్ల ఓ బామ్మ సూపర్ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ వయసులోనూ ఉదయాన్నే ఎంతో ఉత్సాహంతో తన పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జపాన్ దేశానికి చెందిన ఈ బామ్మను కూడా గిన్నిస్ రికార్డు వరించింది. అయితే వయసులో కాదు, మరీ ఎందులో అంటే? ఇక్కడ తెలుసుకుందాం.
జపాన్‌లోని నకగవ ప్రాంతానికి చెందిన 108 ఏళ్ల షిట్సుయ్ హకొయిషి (Shitsui Hakoishi) అనే వృద్ధురాలు గత 94 ఏళ్లుగా సెలూన్ షాపు నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ బార్బర్ గ్రానీ మహిళలకు హెయిర్ కటింగ్, పురుషులకూ క్షవరం, గడ్డం గీయడం, డిఫరెంట్ హెయిర్‌స్టైల్ వంటివి చేస్తూ తనదైనా స్టైల్లో చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పొరపాటున కూడా కస్టమర్లకు చిన్నపాటి కత్తిగాటు, బ్లేడ్ గాయం కానివ్వదు. దీంతో ఈ బామ్మ పేరు ఈ నోటా ఆ నోటా గిన్నిస్ వరల్డ్ రికార్డు వరకు చేరింది. ఈ క్రమంలో ఇటీవల గిన్నిస్ ప్రతినిధులు ఈ బామ్మ బార్బర్ షాపుకి వెళ్లారు. అక్కడ వాళ్లందరి సమక్షంలోనే ఆమె కస్టమర్లకు చకచకా హెయిర్ కట్/వివిధ రకాల హెయిర్‌స్టైల్స్ చేసి చూపించింది. ఆశ్చర్యపోయిన వాళ్లు.. 'ప్రపంచంలోనే అత్యధిక వయసున్న మహిళా బార్బర్'గా గిన్నిస్ రికార్డులో ఈ బామ్మ పేరు నమోదు చేశారు.
కాగా, ఈ గ్రానీ 14 ఏండ్ల వయసులోనే బార్బర్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టోక్యోకి వెళ్లి అక్కడే తను మొదటిసారిగా బార్బర్ పనిలో అప్రెంటిస్‌గా చేరి మెళకువలు నేర్చుకుని, 20 ఏళ్ల వయసులో బార్బర్ లైసెన్స్ పొందినట్లు చెప్పారు. అప్పుడు ఆమె తన భర్తతో కలిసి ఒక సెలూన్ ఏర్పాటు చేసింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధంలో తన భర్త జపాన్ సైన్యంలో చేరి మరణించారు. అప్పటి నుంచి కుటుంబాన్ని పోషించేందుకు ఆమె ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. మరో రెండేళ్ల పాటు తన వృత్తిని కొనసాగిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
READ MORE ...
ముందు ధోతి కట్టుకోండి.. తర్వాత మహిళలు ఏమి ధరించాలో చెప్పండి.. స్త్రీ వస్త్రధారణపై చర్చ