కంపెనీలకు, ఉద్యోగులకు లాభదాయకంగా ‘రిమోట్ వర్క్’

by vinod kumar |   ( Updated:2020-06-03 03:11:10.0  )
కంపెనీలకు, ఉద్యోగులకు లాభదాయకంగా ‘రిమోట్ వర్క్’
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనాకు ముందు వరకు.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ‘వర్క్ ఫ్రమ్ హోమ్’‌కు అనుమతించేవి కాదు. కానీ, కరోనా తెచ్చిన సంక్షోభం వల్ల అన్ని కంపెనీలు ‘రిమోట్ వర్క్’ అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. రిమోట్ వర్క్ అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు లాభదాయకమార్గంగా మారింది. ఎంప్లాయీస్ ఇంటి దగ్గర పనిచేస్తున్నా.. ప్రొడక్టవిటీ పెంచడంతో కంపెనీలు ‘రిమోట్ వర్క్’ను కొనసాగించడానికి ఇష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025 వరకు 70 శాతం ఉద్యోగులు ‘రిమోట్ వర్క్’ చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భవిష్యత్తులో :

కరోనాకు ముందు 5.3 శాతం ఉద్యోగులు మాత్రమే ఫుల్ టైమ్ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయగా, 29 శాతం మంది పార్ట్ టైమ్ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేశారు. కరోనా తర్వాత 50 శాతం మందికి పైగా ‘రిమోట్ వర్క్’ చేస్తున్నారని ‘డిజిటల్ ఇన్‌ఫర్మేషన్’ వరల్డ్ పేర్కొంది.

బెనిఫీషియల్ :

ఇటు ఉద్యోగులకు, అటు కంపెనీలకు ‘రిమోట్ వర్క్’ లాభం తెచ్చిపెట్టింది. కరోనా టైమ్‌లో కంపెనీలు వీలైనంత మేర ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ‘రిమోట్ వర్క్’ కూడా కంపెనీలకు అందుకు ఉపయుక్తంగా మారింది. ఉద్యోగులు లేకపోవడంతో ఎలక్ట్రిక్ బిల్లు, యుటిలిటీస్, కాఫీ, టీ, స్నాక్స్, స్టేషనరీ తదితర ఖర్చులన్నీ కంపెనీలకు కలిసి వస్తున్నాయి. ‘రిమోట్ వర్క్’ వల్ల 4.4 శాతం అవుట్‌పుట్ పెరిగినట్లు హార్వార్డ్ బిజినెస్ రివ్యూ స్టడీ తెలిపింది. అంతేకాదు 29 శాతం మంది రిమోట్ వర్కర్క్ సంతోషంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. రిమోట్ వర్క్‌కు కంపెనీలు అనుమతించకపోతే.. 55 శాతం మంది జాబ్ వెకేట్ చేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే కంపెనీల్లో పనిచేసేందుకు యోచిస్తున్నారట. అంతేకాకుండా 50 శాతం ఉద్యోగుల హెల్త్ కూడా ఇంప్రూవ్ కావడంతో పాటు 56 శాతం అటెండెన్స్ ఇంప్రూవ్ అయ్యింది. అటు ఉద్యోగులకు కూడా ట్రావెలింగ్ టైమ్ తగ్గి ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం, ఇంప్రూవ్‌డ్ కాన్సంట్రేషన్, లెస్ స్ట్రెస్ వంటి ఉపయోగాలున్నాయి. రిమోట్ వర్క్ వల్ల ఉద్యోగులకు లంచ్, కాఫీ, పెట్రోల్, వెహికల్ మెయింటెన్స్ వంటి ఖర్చులు కూడా తగ్గుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed