2025 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే : భవిష్ అగర్వాల్!

by Harish |
ola
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 2025 నాటికి భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉండాలని, నాలుగేళ్లలో దీన్ని సాధ్యం చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఓలా ఛైర్మన్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ అన్నారు. ఎలక్ట్రిక్ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్‌ను నిలిపేందుకు 10-20 ఏళ్లు పడుతుందని, దీనికోసం మొత్తం దేశీయ పరిశ్రమ కలిసి ప్రయాణించాలని ఆయన భావించారు. ఆదివారం ఓలా నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2025 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సంకల్పం, పెట్టుబడులు, టెక్నాలజీ అవసరమని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.

2025 నాటికి దేశంలో పెట్రోల్ టూ-వీలర్లను విక్రయించకుండా పూర్తి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలనే విక్రయించడం సాధ్యమే. దీని ద్వార కొత్త టెక్నాలజీ వినియోగంతో ఉద్యోగాలు పెరుగుతాయని, దానికోసం పరిశ్రమలు మరింత వేగవంతంగా ఈ ప్రక్రియని కొనసాగించాలని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 80 శాతం వాహనాలు ద్విచక్రవానాలు ఉన్నాయి. అయితే, భారత్‌లోని 12 శాతం మంది మాత్రమే టూ-వీలర్లను కలిగి ఉన్నాయి. ఈ వాహనాల వల్ల ఏటా 12 వేల కోట్ల లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. ఇది 40 శాతం కాలుష్యానికి కారణమవుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ కాలుష్యాన్ని తగ్గించాలని భవిష్ అగర్వాల్ వెల్లడించారు.

Advertisement

Next Story