- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ చరిత్రలో తొలిసారి.. ఆనందంలో ట్రాన్స్ జెండర్
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. హుజురాబాద్ ఎన్నికల చరిత్రలో తొలిసారి ట్రాన్స్ జెండర్ ఓటు వేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల 873 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,17,779 కాగా, మహిళా ఓటర్లు 1,19,093 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ విభాగం నమోదైన ఒకే ఓటరు రొంటల కుమారి కావడం విశేషం. గత ఎన్నికల వరకు ఫిమేల్ కోటలో ఓటు వేసిన కుమారి ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశంతో థర్డ్ జెండర్ కోటలో ఓటు హక్కును మొదటిసారి వేయనున్నారు. థర్డ్ జెండర్ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో 40 మంది వరకు ట్రాన్స్ జెండర్లు ఉన్నప్పటికీ వారు మహిళా కోటాలోనే ఓటరుగా నమోదు చేసుకున్నారు.
గతంలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ సంస్థ జరిపిన సర్వేలో తెలంగాణలో ట్రాన్స్ జెండర్ల సంఖ్య 90 వేల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల సంఘం అదర్స్ పేరుతో థర్డ్ జెండర్ కాలమ్‌ను ఏర్పాటు చేయడం ఆరంభించారు. తెలంగాణలో 2018 సార్వత్రిక ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 2 కోట్ల 80 లక్షలు కాగా, ఇందులో ట్రాన్ జెండర్లు 2 ,676 మంది ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 191 మంది మాత్రమే. దీంతో అదర్స్ విభాగం నుంచి థర్డ్ జెండర్‌లో చేరుతున్న ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన వెసులుబాటుతో థర్డ్ జెండర్ కోటలో ఓటు హక్కు వినియోగించుకునేల అధికారులు అవగాహన కల్పించాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది.
ఆనందంగా ఉంది: కుమారి
‘తొలిసారి ట్రాన్స్ జెండర్ కోటాలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మహిళా కోటాలోనే ఇన్నాళ్లు నేను ఓటు వేశాను. ఈసారి మాత్రం థర్డ్ జెండర్ కోటాలో ఓటు వేయబోతున్నాను. ఇందుకు సంబంధించిన దరఖాస్తు తెప్పించుకుని ఆప్లై చేశాను.’ అని ట్రాన్స్ జెండర్ రొంటల కుమారి వెల్లడించారు.