- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎంఈ పరిధిలోకి ఏడు జిల్లా ఆస్పత్రులు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం వైద్య విధాన పరిషత్ పరిధిలో నడుస్తున్న 7 జిల్లా ఆస్పత్రులు, ఒక ఏరియా ఆస్పత్రి వైద్య విద్యా విభాగం పరిధిలోకి వెళ్లాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న 8 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఈ దవాఖాన్లను ఎంపిక చేసినందున ఈ నిర్ణయం అనివార్యమైంది. ఈ నెల 6వ తేదీ నుంచే వీటిని బోధనాస్పత్రులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నది. ఈ ఆస్పత్రుల్లో అవసరమైన ఏర్పాట్లన్నింటినీ పూర్తిచేసేలా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇప్పటిదాకా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచి ఇప్పుడు వైద్య విద్యా విభాగం పరిధిలోకి వెళ్లిన జిల్లా ఆస్పత్రులు ఇవే..
1. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి
2. వనపర్తి జిల్లా ఆస్పత్రి
3. నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రి
4. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రి
5. కొత్తగూడెం జిల్లా ఆస్పత్రి
6. జగిత్యాల్ జిల్లా ఆస్పత్రి
7. మంచిర్యాల్ జిల్లా ఆస్పత్రి
8. గోదావరిఖని ఏరియా హాస్పిటల్