- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయినా.. స్పెక్ట్రమ్‌కు ఇంక్రిమెంట్ రేటు వర్తించదు
దిశ, వెబ్‌డెస్క్: లైసెన్స్ కలిగిన మొత్తం స్పెక్ట్రమ్‌కు ఇంక్రిమెంట్ (Increment to the spectrum)రేటు వర్తించదని టెలికాం రెగ్యులేటరీ (Telecom Regulatory) సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది. స్పెక్ట్రమ్ (spectrum)ను పంచుకునే సమయంలో సంబంధిత బ్యాండ్‌పై మాత్రమే వినియోగ ఛార్జీలపై 0.5 శాతం చొప్పున ఇంక్రిమెంట్ రేటు (Increment Rate) వర్తిస్తుందని ట్రాయ్ తెలిపింది.
ప్రస్తుతం స్పెక్ట్రం (spectrum) భాగస్వామ్య ఒప్పందం రద్దు అంశంలో సమాచారం ఇచ్చేందుకు తగిన నిష్క్రమణ నిబంధనలను మార్గదర్శకాల్లో చేర్చాల్సి ఉందని ట్రాయ్ (Troy)సిఫార్సు చేసింది. ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్‌లో ట్రాయ్ తెచ్చిన డాక్యుమెంట్ (Document)పై స్పందన ఆధారంగా దీన్ని సూచిస్తున్నట్టు వెల్లడించింది. స్పెక్ట్రం (spectrum) పంచుకున్న సమయంలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR)పై 0.5 శాతం చొప్పున ఒక్కో లైసెన్సుకు వినియోగ ఛార్జీల రేటు పెరుగుతుందని టెలికాం విభాగం జనవరిలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.