ఘోర ప్రమాదం.. వరద కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి..

by Sumithra |   ( Updated:2021-12-28 06:59:05.0  )
Tractor-accident1
X

దిశ, ఇబ్రహీంపట్నం: కాలువలో ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్రపూర్ గ్రామ శివారులో గల వరద కాలువలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా, తీవ్ర గాయాలైన డ్రైవర్ ను మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story