AP is Raising: ఏపీ ఈజ్ రైజింగ్.. వృద్ధిరేటులో రెండో స్థానం

by Anil Sikha |
AP is Raising: ఏపీ ఈజ్ రైజింగ్..  వృద్ధిరేటులో రెండో స్థానం
X

* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్వీట్

* కూటమి ప్రభుత్వంలో సాధించాం

• ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం అంటూ పిలుపు

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ వృద్ధిరేటులో దేశంలో రెండో స్థానానికి చేరింది. 2024~25 ఏడాదికి వృద్ధిరేటులో (Grouth Rate) సెకండ్ ప్లేస్ లో నిలిచింది. స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధిరేటు సాధించింది. 9.69 శాతం వృద్ధిరేటుతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 2.02 శాతం పెరిగి ఏపీలో 8.21 శాతం నమోదు అయింది. ప్రస్తుత ధరల విభాగంలో 12.02 శాతంగా ఏపీ వృద్ధిరేటు ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రైజింగ్ అంటూ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధిరేటును సాధించామన్నారు. పలు రంగాల్లో పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల సమష్టి విజయం అంటూ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి నారా లోకేష్ (Lokesh) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఏపీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధిరేటు పెరగడం చంద్రబాబు నాయుడు దార్శనికతకు, ఆర్థిక క్రమశిక్షణకు, సుపరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నిజమైన సంస్కర్త ఆధ్వర్యంలో ఏపీ రైజింగ్ అంటూ పోస్ట్ చేశారు.

Next Story

Most Viewed