IPL: కీలక మ్యాచ్‌లో తడబడ్డ SRH బ్యాటర్లు.. ముంబై టార్గెట్ ఎంతంటే?

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-17 16:52:27.0  )
IPL: కీలక మ్యాచ్‌లో తడబడ్డ SRH బ్యాటర్లు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వాంఖడే మైదానం(Wankhede Stadium) వేదికగా ముంబై(Mumbai Indians)తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఓపెనర్లు పర్వాలేదు అనిపించినా తర్వాత వచ్చిన వారు వరుసగా పెవీలియన్ బాట పట్టారు. దీంతో మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు 162 పరుగులు చేసింది. ముంబై విజయ సాధించాలంటే 163 పరుగులు చేయాల్సి ఉంది. హైదరాబాద్ జట్టు బ్యాటర్లలో అభిషేక్ శర్మ (40), ట్రావిస్ హెడ్ (28), ఇషాన్ కిషన్ (02), నితీష్ కుమార్ రెడ్డి (19), హెన్రిచ్ క్లాసెన్ (37), అనికేత్ వర్మ (18), పాట్ కమ్మిన్స్ (8) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బూమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.



Next Story

Most Viewed