- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డమ్మీ హోం మినిస్టర్.. అది ప్రభుత్వ హత్యే : ఉత్తమ్
X
దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్య ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. న్యాయం కోసం పోరాడే వారిని చంపడం హేయమైన చర్య అన్నారు. టీఆర్ఎస్ వచ్చాక రాష్ట్రంలో అవినీతి, హత్యలు పెరిగిపోయాయని వెల్లడించారు. ఈ హత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే అని, కేసీఆర్ ఈ హత్యలను కనీసం ఖండించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గులాబీ చొక్కా వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనకు ప్రాణహాని ఉందని వామనరావు సతీమణి నాగమణి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినా.. ఇప్పటివరకూ స్పందించలేదని, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పూర్తిగా డమ్మీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయిందని, సీబీఐ చేత విచారణ జరిపించాలని అన్నారు.
Advertisement
Next Story