రాజాసింగ్ శోభయాత్రపై ఎంపీ అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

by GSrikanth |
రాజాసింగ్ శోభయాత్రపై ఎంపీ అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్‌ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహిచిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఫొటో దర్శనం ఇవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా.. అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాజాసింగ్ నిర్వహించిన శోభయాత్రలో గాడ్సే ఫొటోలు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో మొదటి టెర్రరిస్టు గాడ్సేనే అని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ అభిమానులు గాడ్సే ఫొటోలు ప్రదర్శిస్తుంటే.. పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. తాము కూడా ర్యాలీలు చేసి లాడెన్, హజారీ ఫొటోలు ప్రదర్శిస్తే.. ఊరుకుంటారా? అని అడిగారు. దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story