- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాక్టీస్ లేకుండా పాదయాత్రలు చేస్తే.. ఆ సమస్యలు వస్తాయట
దిశ ప్రతినిధి , హైదరాబాద్: శారీరకంగా చురుగ్గా ఉండటం చాలా మంచి అలవాటు. రోజూ నడవడం మంచి ఆరోగ్యానికి సులువైన మార్గం. అయితే, ఏదైనా ఎక్కువగా చేస్తే మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎక్కువ దూరం నడిచేముందు లేదా ఎక్కువ సేపు శారీరక వ్యాయమం చేసేముందు.. అంటే ఎక్కువ దూరం మారథాన్ నడక లేదా పాదయాత్రలు చేసేటప్పుడు ముందు జాగ్రత్తలతో పాటు నిపుణుల నుంచి సలహాలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం.
ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు సుదీర్ఘ పాదయాత్రలు ప్రారంభిస్తారు. దానివల్ల వాళ్లు ఎక్కువ ప్రాంతాన్ని కాలినడకన కవర్ చేయడానికి వీలవుతుంది. ఇది ఒక్కోసారి కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. ఇలాంటి పాదయాత్రలు ప్రారంభించే ముందే కొందరు నాయకులు తమ శారీరక సామర్థ్యం సరిచూసుకుంటారు. కానీ వాళ్ల అనుచరులు మాత్రం అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెంట వెళ్తారు. అలా సిద్ధం కాకపోతే వారి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడి, చివరకు పాక్షికంగా లేదా శాశ్వతంగా కూడా నష్టం వాటిల్లుతుంది.
పాదయాత్రల వల్ల ఆర్థోపెడిక్ సమస్యలు..?
కిలో మీటర్ల కొద్ది చేపట్టే పాదయాత్రల వల్ల మోకాళ్ల నొప్పులు (ఆస్టియోఆర్థరైటిస్) , మృదులాస్థి అరిగిపోవడం, లిగమెంట్ గాయం, కాళ్ల నొప్పులు , మడమ నొప్పులు , పాదం నొప్పి (ప్లాంటర్ ఫాసైటిస్), కండరాల నొప్పులు, తిమ్మిర్లు (ఫైబ్రోమయాల్గియా), పాదాల్లో ఒత్తిడి వల్ల ఫ్రాక్చర్లు, నడుం నొప్పి, పాత గాయాలు తిరగబెట్టడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పాదయాత్ర సమయంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థోపెడిక్ గాయాలను నివారించవచ్చు. పాదయాత్రకు ముందు స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్లతో ఆర్థోపెడిక్ క్లినికల్, రేడియోలాజికల్ పరీక్షలు, వయసు వల్ల వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పరీక్ష, అవసరమైతే ఎక్స్-రేలు, ఎంఆర్ఐ స్కాన్లు వంటివి చేయాల్సి ఉంటుంది.
నెల ముందు నుండే ప్రాక్టీస్ చేయాలి..
డాక్టర్ కొల్లా సాకేత్ -ఆర్థోపెడిక్ సర్జన్- గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి ..
వార్మప్ లాంటి భౌతిక వ్యాయామం, కండరాలు సాగే వ్యాయామాలు, పాదయాత్రకు కనీసం నెల ముందు శిక్షణ తీసుకోవాలి. కూర్చోనే పరిస్థితి సరిచేసుకోవడం బాగా సాయపడతాయి. పాదరక్షలు సరైనవి ఎంచుకోవాలి. స్పోర్ట్స్ షూలు అయితే మెత్తటి సిలికోన్ సోల్ లేదా మైక్రో సెల్యులార్ రబ్బరు మెటీరియల్‌వి వినియోగించాలి . కఠిన వ్యాయామాలకు శరీరాన్ని సిద్ధం చేయడానికి కొన్ని ముందుజాగ్రత్తగా, శక్తినిచ్చే మందులు ఉపయోగపడతాయి. విటమిన్ డి3, కాల్షియం స్థాయి ఎంతుందో చూసుకోవాలి. ఎలక్ట్రోలైట్ల సమతుల్యత ముఖ్యం. పాదయాత్రకు ముందు, పాదయాత్ర సమయంలోనూ వీటి స్థాయి సరిగా ఉండేందుకు అవసరమైతే మందులు తీసుకోవాలి. కీళ్ల ఆరోగ్యం కోసం మోకాళ్లలోకి జెల్ ఇంజెక్షన్లు చేసుకోవడం ఇటీవలి కాలంలో బాగా సమర్థంగా పనిచేస్తున్న చికిత్స. ప్రభావిత ప్రాంతాల్లో ముందే ఇంజెక్షన్లు చేసుకోవడం వల్ల, టేపులు వేయడం, స్ట్రాపులు వేయడం వల్ల త్వరగా కోలుకుంటారు. నడిచే సమయంలో తగినన్ని నీళ్లు తాగడం, పోషక, సమతుల ఆహారం తీసుకోవడం, మల్టీ-విటమిన్ సప్లిమెంట్లు, విటమిన్ ఇ, లెవోకార్నిటైన్ తీసుకోవడం తప్పనిసరి.