Jr.NTR :కరోనాను జయించిన జూనియర్ ఎన్టీఆర్..

by Shyam |   ( Updated:2021-05-25 00:11:22.0  )
Jr.NTR :కరోనాను జయించిన జూనియర్ ఎన్టీఆర్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) కరోనా నుండి కోలుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన ఎన్టీఆర్ హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందారు. తాజాగా ఆయన మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ ( Jr.NTR ) తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

“నాకు కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగెటివ్ రావడం ఆనందంగా ఉంది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నాకు వైద్యం చేసిన కిమ్స్ హాస్పిటల్స్ డిఆర్ ప్రవీణ్ కులకర్ణి, నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది. నా ఆరోగ్యం గురించి మంచి కేర్ తీసుకున్నారు. కోవిడ్-19 ని అందరు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తగు జాగ్రత్తలను తీసుకొంటూ, సానుకూల దృక్ప‌థంతో ఈ వ్యాధిని జ‌యించ‌వ‌చ్చు. కరోనా పోరాటంలో మ‌న సంకల్ప బ‌ల‌మే మ‌న అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి.. భయపడకండి. మాస్కులు ధ‌రించండి.. ఇంట్లోనే ఉండండి” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఎన్టీఆర్ కరోనా నుండి కోలుకోవడంతో ఎన్టీఆర్ ( Jr.NTR )అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story