నేను చచ్చిపోయిన రోజు ఇది: ఆర్జీవీ

by Anukaran |   ( Updated:2021-04-06 23:06:45.0  )
నేను చచ్చిపోయిన రోజు ఇది: ఆర్జీవీ
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్ట్రైలే వేరు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఆయన విచిత్ర తీరుపై ఎప్పుడూ విమర్శలొస్తూ ఉంటాయి. ఎలా పడితే అలా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆర్జీవీలో ఉన్న స్పెషల్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఆయనతో ఎవరూ వివాదాలకు వెళ్లరు.

ఇవాళ ఆర్జీవీ బర్త్‌డే కావడంతో ఆయనకు చాలామంది సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అయితే ఆర్జీవీకి బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టముండదు. అందుకే విషెస్ ఎవరు చెప్పినా ఆయన స్వాగతించరు.

https://twitter.com/RGVzoomin/status/1379643333874647050

ఇవాళ బర్త్ డే సందర్భంగా ఆర్జీవీకి చాలామంది బర్త్ డే విషెస్ చెబుతున్నారు. దీంతో వారికి నో థ్యాంక్స్ అని ఆర్జీవీ చెబుతున్నాడు. ‘లేదు, ఈ రోజు నా పుట్టినరోజు కాదు, కానీ ఈ రోజు నా మరణ దినం. ఎందుకంటే నా జీవితంలో మరో సంవత్సరం ఈ రోజు మరణించింది’ అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story