- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాటలు కాదు.. చేతల్లో చూపించండి: సినీనటి కవిత

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు కావాల్సింది మాటలు కాదు… చేతలు కావాలి అని టాలీవుడ్ నటి కవిత అన్నారు. వరదలు వస్తున్నాయని వాతావరణ శాఖ ముందే తెలుపుతుంది. కానీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వముందా.. వదరలకు కారణం ముమ్మాటికి ప్రభుత్వందేనని ఆమె విమర్శించారు. ప్రజలను ఫూల్స్ చేయరాదని, ముందు సిటీకి ఏమి చేశారో చెప్పాలని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సినీ సంస్థకు చైర్మన్ ఎక్కడ..?: సివిఎల్ నరసింహారావు
అనంతరం సినీ నటుడు సివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమ సంస్థకు ఇప్పటి వరకు చైర్మన్ మూడేండ్లుగా లేకపోవడం ఏంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సినిమా పేరుతో మోకిల గ్రామంలో 5 ఎకరాలను పొందడం అభివృద్ధి కాదని సినిమా డైరెక్టర్ శంకర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ సినిమా రంగానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శంకర్ సినీ కార్మికులకు ఇండ్ల గురించి ఆలోచించావా..? అని నరసింహారావు నిలదీశారు.