- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు కరోనాపై జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
by srinivas |

X
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్త కేసులు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. తాజాగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్.. కోవిడ్-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతంమ్ సావాంగ్, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు సీఎం ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు.
Next Story