తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత చాకలి ఐలమ్మ : కిషోర్ గౌడ్

by Shyam |   ( Updated:2021-09-26 03:07:07.0  )
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత చాకలి ఐలమ్మ : కిషోర్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీసీ కమిషన్ సభ్యులు కోతి కిషోర్ గౌడ్, Ch. ఉపేంద్ర హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధిపత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని మోస్తూ దొరలను గడీల నుంచి ఉరికించారని అన్నారు. తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత, తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె జయంతి, వర్ధంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఈ నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, మోడ్రన్ వాషింగ్ మిషన్లను రజకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ఆనాడు వలసపాలకుల అణిచివేతకు వ్యతిరేకంగా మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అనిల్ గౌడ్, NN రాజు, రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలేటి రమేష్, కార్యదర్శి మలిపెద్ది శ్రీకాంత్, రాము, దిలీప్, ప్రవీణ్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed