ఏపీలో కొనసాగుతున్న కరోనా తీవ్రత..

by Anukaran |
corona
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 49,568 సాంపుల్స్ పరీక్షించగా 1,125 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య 20,31,974కు పెరిగింది. అదే సమయంలో కరోనాతో 9 మంది మృతి చెందగా..తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,019కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 1,356 కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,03,543కు పెరిగింది. ప్రస్తుతం 14,412 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,74,13,209 సాంపిల్స్‌ను పరీక్షించడం జరిగినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed