ఏపీలో 2 వేలు దాటిన మృతుల సంఖ్య

by Anukaran |   ( Updated:2020-08-09 10:06:56.0  )
ఏపీలో 2 వేలు దాటిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. రోజుకీ 10 వేలకు పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు వైరస్‌కు బలవుతున్నారు. ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. ఏకంగా 10,820 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో 97 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2036కి చేరింది. తాజా కేసులతో మొత్తంగా 2,27,860 కేసులు రికార్డు అయ్యాయి. కాగా, ఈ ఒక్క రోజులోనే 9,097 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 87,112 యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:
తూర్పుగోదావరి జిల్లా 1543
కర్నూలు 1399
పశ్చిమ గోదావరి 1132
విశాఖపట్నం 961
గుంటూరు 881
అనంతపురం 858
చిత్తూరు 848
కడప 823
నెల్లూరు 696
శ్రీకాకుళం 452
కృష్ణా 439
ప్రకాశం 430
విజయనగరం జిల్లాలో 358 కరోనా కేసులు నమోదైనట్టు హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed