- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిండర్ నుంచి ‘ఫొటో వెరిఫికేషన్’ ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’ తమ ఇండియన్ యూజర్లకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ ఫోన్‌లో దిగిన సెల్ఫీ ఫొటోలతో ప్రొఫైల్ ఫోటోలు మ్యాచ్ అవుతున్నాయా లేదో చెక్ చేస్తుంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకుంటోంది. వెరిఫికేషన్ ప్రాసెస్ కేవలం నిమిషాల్లోనే జరిగిపోతుందని కంపెనీ వెల్లడించింది. దీనివల్ల ఫేక్ ప్రొఫైల్స్ యూజ్ చేసే వారికి చెక్ పెట్టడంతో పాటు బ్లూ చెక్ మార్క్ ఉన్న ప్రొఫైల్స్‌ను నమ్మదగినవిగా యూజర్లు గుర్తించే వీలుంది. తమ యూజర్ల సేఫ్టీ కోసమే ఈ తరహా ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు టిండర్ తెలిపింది.
ప్రొఫైల్ వెరిఫికేషన్ ఇలా :
1. టిండర్ యాప్‌ను ఓపెన్ చేసి.. ప్రొఫైల్ ఐకాన్ ట్యాప్ చేయాలి
2. గ్రే చెక్ మార్క్‌పై ట్యాప్ చేసి.. నేమ్ ఏజ్ సరి చూడాలి
3. ‘వెరిఫై యువర్ ప్రొఫైల్’ను సెలెక్ట్ చేయాలి
4. ఓ పోజ్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేస్తూ.. సెల్ఫీ దిగాలి.
5. ఆ పోజ్‌ను మ్యాచ్ చేస్తూ ఉన్న సెల్ఫీ ఫొటో రివ్యూ కోసం ‘సబ్‌మిట్ ఫర్ రివ్యూ’పై క్లిక్ చేయాలి.
– 4, 5 పాయింట్లను మరోసారి రిపీట్ చేయాలి.