టిక్‌టాక్ రేటింగ్ డౌన్.. గొడవ ‘క్యారీ’ఫార్వర్డ్?

by Harish |
టిక్‌టాక్ రేటింగ్ డౌన్.. గొడవ ‘క్యారీ’ఫార్వర్డ్?
X

యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్ గొడవ రోజురోజుకూ పెరుగుతోంది. టిక్‌టాక్ సెలెబ్రిటీ ఆమిర్ సిద్ధిఖీని రోస్ట్ చేస్తూ యూట్యూబర్ క్యారీ మినాటి పెట్టిన వీడియోను యూట్యూబ్ డిలీట్ చేసిన తర్వాత ఆ గొడవ మరింత పెరిగింది. యూట్యూబర్ల అభిమానులు టిక్ టాక్ బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మొదట టిక్‌టాక్‌ని తమ ఫోన్ల నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేయాలని చెబుతూ యూట్యూబర్ టెక్నికల్ గురూజీ తనదైన శైలిలో అభిమానులకు తెలిపారు. అదే క్రమంలో అభిమానులు అందరూ గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కి తక్కువ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇలా రేటింగ్ తక్కువ చేయడం వల్ల టిక్ టాక్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తారని ఈ ప్రయత్నం.

చూడబోతే ఈ ప్రయత్నం ఫలిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు 4.6 ఉన్న టిక్‌టాక్ యాప్ రేటింగ్ మొన్న 3.8కి వచ్చింది. కానీ మంగళవారం నాటికి 2.0కి పడిపోయింది. టిక్‌టాక్ రేటింగ్ ఇంత దారుణంగా పడిపోవడం చూస్తే యూట్యూబర్ల అభిమానులు ఎంత బలంగా నిర్ణయించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్, టిక్‌టాక్‌లు భారతదేశాన్ని చెడగొడుతున్నాయంటూ చేస్తున్న ప్రచారం వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే టిక్‌టాక్ ప్రభావశీలురుగా స్థిరపడిన వారు తమ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతారు. ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

Advertisement

Next Story