జనవరి నుంచి వ్యాపారులకు జీఎస్టీ నిబంధనలు కఠినతరం!

by Harish |
GST Tax
X

దిశ, వెబ్‌డెస్క్: పరోక్ష పన్ను విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ సెంట్రల్ వస్తు సేవల పన్ను(సి జీఎస్టీ) చట్టంలో కొత్త ఏడాది జనవరి 1 నుంచి పలు సవరణలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. పన్ను చెల్లింపుల్లో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుత ఏడాది ప్రారంభంలో ఆమోదించిన ఆర్థిక చట్టంలో భాగంగానే ఉన్నప్పటికీ వాటి అమలు తేదీని తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం.. కొత్త సవరణలు వినియోగదారుల పై ఎలాంటి ప్రభావం చూపదు. వ్యాపారాల నిబంధనలను మాత్రమే కఠినతరం చేస్తుంది. ఏదైనా సంస్థ పన్ను చెల్లింపులకు, అమ్మకాలకు మధ్య వ్యత్యాసం ఉంటే అలాంటి కంపెనీలపై తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నేరుగా అధికారులను పంపిస్తుంది.

ఇప్పుడున్న నిబంధనల ప్రకారమైతే ఇలాంటి సందర్భాల్లో కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. అలాగే, రూ. 5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థ జీఎస్‌టీఆర్1, జీఎస్టీఆర్3బీని దాఖలు చేయాలి. జీఎస్టీఆర్1 సేల్స్-ఇన్-వాయిస్‌కు చెందిన రిటర్న్ కాగా, జీఎస్టీఆర్3బీ జీఎస్టీఆర్1లోని రిటర్న్స్‌కు నెలవారీ దాఖలు చేసే జీఎస్టీ రిటర్న్. ఈ రెండింటీ మధ్య వివరాల్లో అవకతవకలుంటే పన్ను అధికారులు నేరుగా కంపెనీకి వెళ్లనుంది. రికవరీ కోసం ఎటువంటి నోటీసులను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే, ముడి పదార్థాలు, వ్యాపార సంస్థల సేవలపై విధించే పన్నులపై క్రెడిట్ మంజూరును నియంత్రించే నిబంధనలను కఠినతరం చేయనున్నారు. సంస్థలు విక్రయించే వస్తువు వివరాలను నెలవారీ రిటర్న్‌లో చేర్చకపోతే అలాంటి వస్తువులపై చెల్లించిన పన్నుల క్రెడిట్‌ను కొనుగోలుదారులు పొందడానికి అవకాశం ఉండదు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story