టైగర్ స్కిల్స్ ‘అన్ బిలీవబుల్’

by  |
టైగర్ స్కిల్స్ ‘అన్ బిలీవబుల్’
X

దిశ, వెబ్‌డెస్క్: టైగర్ ష్రాఫ్.. అమేజింగ్ లుక్, ఎక్సలెంట్ ఫిజిక్, హంబుల్ యాక్టర్, మార్షల్ ఆర్టిస్ట్.. ఇంతకు ముందు ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గురించి ఇవే చెప్పుకునేవాళ్లం. కానీ సూతింగ్ వాయిస్‌తో మెస్మరైజ్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇంటర్నేషనల్ వైబ్స్‌తో ‘అన్ బిలీవబుల్’ సాంగ్ రిలీజ్ చేసిన టైగర్ ష్రాఫ్.. మరో టాలెంట్ చూపించి నిజంగా అన్‌బిలీవబుల్ అనిపించాడు.

తన సొంత పాట మీద తనే సాంగ్ పాడుతూ డాన్స్ చేయాలనే డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకుంటూ సాంగ్ రిలీజ్ చేసిన టైగర్ ష్రాఫ్.. తన సింగింగ్ డెబ్యూతో రికార్డ్‌లు బ్రేక్ చేస్తున్నాడు. రిలీజైన రెండు గంటల్లోనే ‘అన్‌బిలీవబుల్’ ఆల్బమ్ యూట్యూబ్‌లో రెండున్నర లక్షల వ్యూస్ సంపాదించి వావ్ అనిపిస్తోంది. టైగర్ వాయిస్‌కు ఫిదా అయిన ప్రేక్షకులు.. సాంగ్ ప్రెజెంటేషన్, డాన్స్ మూవ్స్ అద్భుతంగా ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మైకేల్ జాక్సన్ రోజులు మళ్లీ గుర్తు చేశారని ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి ఆల్బమ్స్ టైగర్ నుంచి మళ్లీ మళ్లీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని.. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అండ్ సింగర్‌గా రాణించే అన్ని లక్షణాలు టైగర్‌లో ఉన్నాయని చెప్తున్నారు ఫ్యాన్స్.

#YouAreUnbeleivable హాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్న సాంగ్ గురించి స్పెషల్ నోట్ పెట్టాడు టైగర్ ష్రాఫ్. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కు దూకడమే కష్టమైన పని అనుకున్న తాను.. పాట పాడటం, సంగీతం సమకూర్చడం అంతకు మించిన కష్టమని తెలుసుకున్నానని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత కళాకారుల గొప్పతనం గురించి తెలుసుకున్నానన్న ష్రాఫ్.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. కానీ తను వినయపూర్వకంగా చేసిన ప్రయత్నాన్ని మీ ముందు ఉంచుతున్నానని.. తప్పక ఆదరించాలని కోరారు.



Next Story

Most Viewed

    null