ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక..!

by srinivas |
ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక..!
X

దిశ వెబ్‎డెస్క్: ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు కడప, కర్నూలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed