- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తుక్కుగూడ: కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా
హైదరాబాద్ తుక్కుగూడ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారంతో టీఆర్ఎస్ కు 9 మంది కాగా, అటు బీజేపీ కౌన్సిలర్లు కూడా 9 మంది ఉన్నారు. ఇలా ఇరుపార్టీలకు ఓట్లు సమానంగా రావడంతో అధికారులు ఈ ఎన్నికను వాయిదా వేశారు.
కాగా, తుక్కుగూడలో బీజేపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, గతంలో ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారంతో చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి కూడా అదేవిధంగా అనుసరించి ముందుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ, ఇరు పార్టీలకు ఓట్లు సమానంగా రావడంతో ఎన్నిక వాయిదా పడింది. గతంలో తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్న కె. కేశవరావు తాజాగా మరోసారి జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కేకే ఓటు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో టీఆర్ఎస్ కు ఓట్ల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది.