- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చంద్రబాబు వాహనంపై రాళ్లు రువ్విన దుండగులు…
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసింది. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ రోజు తిరుపతిలో టిడిపి బహిరంగ సభ నిర్వహించగా, అక్కడికి చేరుకున్న చంద్రబాబు వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు టిడిపి నేతలకు గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఒకరు మహిళ ఉండడం గమనార్హం. చంద్రబాబు ఈ దాడిని నిరసిస్తూ.. వాహనం దిగి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అంతేకాకుండా జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న తనకే రక్షణ లేకుంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాళ్లతో దాడికి పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story