- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చేటు చేసుకుంది. మంగళవారం ముద్దనూరు సమీపంలో ఆర్టీసీ బస్సు- ఆటో ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో డ్రైవర్, మరో మహిళకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
Next Story