- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు కరోనా
దిశ, స్పోర్ట్స్: మరో ఐదురోజుల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న పాకిస్తాన్ జట్టు సభ్యుల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆగస్టులో పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ముందుగానే అక్కడికి వెళ్లి డర్బిషైర్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించారు. ప్రయాణానికి ముందు రావల్పిండిలో కొందరు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా షాదబ్ ఖాన్, హారిస్ రావుఫ్, హైదర్ అలీకి కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
కరోనా నిర్ధారణ కావడంతో ఈ ముగ్గురు క్రికెటర్లు ఇంగ్లండ్ వెళ్లడం కష్టమేనని తెలుస్తున్నది. మరోవైపు సోమవారం బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్, బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్‌కు కూడా పరీక్షలు జరిపారు. వారి ఫలితాలు రావల్సి ఉంది. ఇంగ్లండ్‌లో ఎవరైనా ఆటగాడు కరోనా బారిన పడితే అతని స్థానంలో మరొకరిని కొవిడ్-19 రిప్లేస్‌మెంట్ కింద ఆడించాలని 29మంది ఆటగాళ్లను పీసీబీ ఎంపిక చేసింది. కానీ, అనూహ్యంగా పర్యటనకు ముందే ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో పీసీబీ కొత్త వారి కోసం వెతుకులాట మొదలు పెట్టింది.