నెల్లూరులో విషాదం.. కెమికల్ గ్యాస్ లీకై ముగ్గురు మృతి

by srinivas |
gas leak, chemical factory
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పరిస్థితి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Next Story

Most Viewed