- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పరకాలలో ఆ 5 గంటలు టెన్షన్.. టెన్షన్..!
దిశ, పరకాల: పరకాల జిల్లా సాధన ఉద్యమం ఆదివారం తీవ్ర ఉత్కంఠకు తెర తీసింది. సుమారు ఐదు గంటల పాటు అధికార ప్రతిపక్ష ర్యాలీలు, నినాదాలు, ప్రతి నినాదాలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత 20 రోజులుగా అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సాధన ఉద్యమ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలకు దిగారు. మాటల యుద్ధం స్థానంలో ఆదివారం పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించారు.
టీఆర్ఎస్ నేతలు ఉదయం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నుండి బస్టాండ్ కూడలి వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేఖంగా, ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో పరకాల అమరవీరుల జిల్లా సాధన సమితి, భవన నిర్మాణ కార్మికుల యూనియన్, పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో అమరధామం వద్దకు చేరుకోని ర్యాలీకి బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు అధికార పార్టీ నాయకులు ర్యాలీ ముగిసే వరకు వారిని అక్కడే నిలిపివేశారు. అధికార పార్టీ నాయకుల ర్యాలీ ముగిసిన అనంతరం అమరదామం నుండి బయలుదేరిన జిల్లా సాధన ఉద్యమకారులు అంబేద్కర్ సెంటర్ వద్దకు చేరుకొని రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపైన బైఠాయించారు. దీంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసుల జోక్యంతో అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరిన అఖిలపక్ష నేతలు అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో సుమారు మూడు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి. ట్రాఫిక్ స్తంభించింది.
ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరకాల ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాయంపేట, ఆత్మకూరు, పరకాల సీఐ, ఎస్సైలతో పాటు భారీ ఎత్తున పోలీసులు మోహరించి బందోబస్త్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పరకాల పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, ప్రధాన కార్యదర్శి మడికొండ శీను, వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, కార్పొరేటర్లు మడికొండ సంపత్, నాయకులు సోదర రామకృష్ణులు, అమరవీరుల జిల్లా సాధన సమితి కన్వీనర్ పిట్ట వీరస్వామి, కో కన్వీనర్ భిక్షపతి, వెంకటస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ సీపీఐ నాయకులు సాంబయ్య, పద్మశాలి సంఘం నాయకులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.