బెస్ట్ ఫ్రెండ్స్.. పాతికేళ్లుగా ‘డైలీ’ మ్యాచింగ్ డ్రెస్

by Shyam |
Kerala-Friends
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో స్నేహానికి మించిన ఆస్తి లేదంటారు. నిజమే.. ఎల్లప్పుడూ మన మంచి కోరే స్నేహితుడు పక్కనే ఉంటే ఆ ధైర్యాన్ని ఆస్తి, అంతస్తులతో కొలవలేం. ఆర్థికంగా సాయపడకున్నా.. ఆపదలో తోడుండే మిత్రుడు రక్త సంబంధీకుల కన్నా ఎక్కువని ఎన్నో స్నేహ బంధాలు నిరూపించాయి కూడా. కేరళకు చెందిన రవీంద్రనాథన్ పిళ్లై, ఉదయ్‌కుమార్ కూడా అలాంటి స్నేహితులే. దాదాపు పాతికేళ్లుగా టైలరింగ్ షాప్ నడిపిస్తున్న వీరిద్దరూ.. ప్రతీరోజు ఒకే తరహా బట్టలు ధరించడం విశేషం. అసలు వీరి ఫ్రెండ్‌షిప్ ఎలా మొదలైంది? ఇన్నేళ్ల సావాసంలో పొరపచ్చాలకు తావు లేకుండా మంచి మిత్రులుగా ఎలా కొనసాగుతున్నారు? తెలుసుకుందాం..

కేరళ, అలప్పుజా జిల్లాలోని కాయమాకులం టౌన్‌లో రవీంద్రనాథన్ పిళ్లైకి, ఉదయ్‌కుమార్‌కు వేరు వేరు టైలరింగ్ షాప్స్ ఉండేవి. ఒకరోజు కామన్ ఫ్రెండ్ తిలకన్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. అయితే ఇది జరిగింది 1982లో కాగా.. క్రమంగా వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ బలపడింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమకంటూ ఓ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇంటా, బయటా డైలీ ఒకే రకమైన బట్టలు ధరించి సెపరేట్ ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అయితే సేమ్ కలర్ అనే కాదు.. షర్ట్స్, ప్యాంట్స్ స్టిచ్చింగ్‌కు ఒకే మెటీరియల్‌ను వాడతామని, 25 ఏళ్లుగా ఇదే అలవాటు కొనసాగిస్తున్నామని రవీంద్రనాథన్ పిళ్లై తెలిపారు. దశాబ్దాలుగా తమ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతుండటం పట్ల ఉదయ్‌కుమార్ గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు.

‘ఒకరికొకరు పరిచయమైన 6ఏళ్ల తర్వాత అంటే 1988లో వేర్వేరుగా ఉన్న తమ టైలరింగ్ షాప్స్‌ను ఒకటిగా చేశాం. ఇద్దరి ఇంటి పేరులోని ఫస్ట్ లెటర్స్‌ కలిసొచ్చేలా ‘పీకే టైలర్స్’గా మార్చేశాం. అప్పటి నుంచి టౌన్ పీపుల్ మా ఇద్దరిని ‘పచ్చు, కోవలన్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఇవి మలయాళ డైరెక్టర్ పీకే మంత్రి తన సినిమాలో క్రియేట్ చేసిన కార్టూన్ క్యారెక్టర్స్ పేర్లు. ఇలా పిలవడం పట్ల మేమేం బాధపడటంలేదు. ఎందుకంటే మా షాప్ పేరుకూడా ‘పీకే’నే కదా!’ అని నవ్వుకున్నారు రవీంద్రనాథన్. అంతేకాదు 2003నుంచి ఈ రెండు ఫ్యామిలీలు సింగిల్ కాంపౌండ్‌లో నివసిస్తుండగా.. మొదట్లో ఇంట్లో వాళ్లందరూ మ్యాచింగ్ క్లాత్స్ ధరించేవారు. కానీ ఆడవాళ్లకు సేమ్ క్లాత్స్ దొరకడం కష్టం కావడంతో విరమించుకున్నారు.

వీరిద్దరి లైఫ్‌స్టైల్ గురించి ‘వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డే’ సందర్భంగా 2006ఆగస్టులో మొదటిసారి మాతృభూమి పత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాతే ఈ అపూర్వ మిత్రుల స్టోరీ అన్ని ఎడిషన్లకు న్యూస్‌గా మారింది. రీసెంట్‌గా క్లబ్ ఎఫ్‌ఎంతో పాటు 24 న్యూస్‌లోనూ టెలికాస్ట్ అయింది. ఇలా మీడియాలో తమ పేర్లు ‘పచ్చు, కోవలన్’గానే రిప్రజెంట్ కాగా.. స్థానికులు కూడా అలాగే ఫిక్స్ అయ్యారని రవీంద్రనాథన్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed