నగ్నంగా చోరీ… ఆశ్చర్యంలో పోలీసులు

by Anukaran |   ( Updated:2020-09-08 07:10:18.0  )
నగ్నంగా చోరీ… ఆశ్చర్యంలో పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలో ఓ దొంగ వినూత్నంగా ఆలోచించి, బట్టలు లేకుండా నగ్నంగా చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా పరిధిలోని మర్రిపాలెం లేఅవుట్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… లేఅవుట్‌లో వ్యాపారి వడ్డాది త్రినాథరావు కుటుంబసభ్యులతో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున ౩ గంటల సమయంలో ఓ వ్యక్తి తన ఇంటి తలుపులు, కిటికీలు పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడి, బీరువాలోని రూ.20 వేల నగదుతో పాటు సెల్ ఫోన్ దొంగిలించాడని బాధితుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో ఆ ప్రాంతంలోని మరికొన్ని ఇళ్లలోకి కూడా దొంగలు చొరబడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందులో భాగంగానే చోరీ జరిగిన ఓఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్ని పరిశీలిస్తే ఓ వ్యక్తి తన దుస్తులు విప్పేసి, నగ్నంగానే ఇంట్లోకి చొరబడినట్టు పోలీసులు గుర్తించారు. నగ్నంగా చోరీకి యత్నించడంతో పోలీసులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తమ విచారణలో ఆ వ్యక్తి సైకోగా తేలిందని క్రైం ఎస్ఐ మన్మథరావు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed