రైతులు, వలస కార్మికులకు లబ్ది : ప్రధాని

by vinod kumar |
రైతులు, వలస కార్మికులకు లబ్ది : ప్రధాని
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించిన నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయని, తద్వారా రైతులు, వలస కార్మికులు లబ్ది పొందనున్నారని తెలిపారు. రైతులు, వీధి వ్యాపారులకు ఆహార భద్రతను కల్పించడంతోపాటు పరపతికి సంబంధించి ఊరటనిస్తాయని వివరించారు. రెండో విడతగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. వలస కార్మికులకు రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయనున్నట్టు ప్రకటించారు. రేషన్ కార్డు లేకున్నా.. ప్రతి వలస కార్మికుడికి ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం, కిలో పప్పులు, కిలో శనగలను అందజేయనున్నట్టు వివరించారు.

Advertisement

Next Story