- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇక సహించేది లేదు.. వాళ్ల నాలుకలు కోస్తాం : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ ప్రధాన ఎజెండా అని, అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని అటవీ, పర్యావరణ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణ సమీపంలోని గండి రామన్న శ్రీ సాయి బాబా ఆలయంలో రూ. 25 లక్షలతో చేపట్టిన ఆలయ ప్రహారి గోడ, ఇతర అభివృద్ది పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్దికి నిధులు మంజూరు చేస్తున్నామని, నిర్మల్ జిల్లా ఉన్న ప్రధాన ఆలయాలను కూడా అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రజలల్లో కూడా ఆధ్యాత్మిక భావన పెరిగి ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని తెలిపారు. దేవాలయాలకు వచ్చే భక్తుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి కొందరికి మనసున పడ్తలేదని, అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని, ఎవ్వరిపై మేము విమర్శలు చేయడం లేదని తెలిపారు. ఓ పక్క ఇంత అభివృద్ధి జరుగుతుంటే… కొందరికి ఏమి తోచకుండా పొద్దు పోతలేదని, మొన్న ఏం పని పాట లేనోళ్లు నిర్మల్ కు వచ్చి పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ ఇక్కడ ధర్నాలు చేశారని విమర్శించారు. నలుగురైదుగురు కార్యకర్తలను వెనుకేసుకు వచ్చి రాజకీయ దురుద్దేశ్యంతో ఏది పడితే అది మాట్లాడారన్నారు.
మేము గుడులు కట్టిస్తున్నామా? గుళ్ళలోని లింగాలను మింగుతున్నామా? అన్నది ప్రజలకు తెలుసునని, మీరు మాట్లాడేది ప్రజలు గమనిస్తున్నారు అన్నది మర్చిపోవద్దని హితవు పలికారు. నోరును అదుపులో పెట్టుకోవాలని, మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకొండని సూచించారు. మా ఓపికకు కూడా హద్దు ఉంటుందని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, అవసరమైతే అబద్దాలు మాట్లాడినోళ్ళ నాలుక కోస్తామని హెచ్చరించారు. సరైన సమయంలో మేము కూడా ధీటుగా సమాధానం చెబుతామని ఉధ్ఘాటించారు.