- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చల్లగాలికి నిద్రపోయిన వారి ఇంట్లో దొంగలు ఏంచేశారంటే.. ?
దిశ, ధర్మపురి: వేసవి వచ్చిందంటే చాలు పల్లెటూరిలో చాలా మంది వాకిట్లో నిద్రపోతారు. అయితే అలా ఓ గ్రామంలో అందరూ ఇంటిికి తాళం వేసి వాకిట్లో నిద్రపోయారు. దీంతో బుధవారం అర్ధరాత్రి దుండగులు తలుపుకు ఉన్న ఇంటి తాళాలు తీసి రెండు ఇళ్లను చోరి చేశారు. ఈ ఘటన ధర్మపురి మండలంలోని కమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మూడారి రాజన్న, రాజూరి శ్రీనివాస్ల కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఇంటి ముందు పడుకున్నారు. దుండగులు తలుపుకు ఉన్న ఇంటి తాళాలు తీసి ఇంట్లోకి ప్రవేశించి రాజన్న ఇంట్లోని 7 తులాల బంగారు నగలు, నగదుతో పాటు కొంత వెండి సామాగ్రిని దొంగిలించి, పక్కనే ఉన్న శ్రీనివాస్ ఇంట్లో చొరబడి వారి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, రూ. 2 వేల నగదు తో పాటు కొంత వెండి సామాగ్రిని దొంగిలించారు. తర్వాత కుమ్మరి శంకర్ ఇంట్లో ప్రవేశించి ఇంటి తాళాలు తీశారు. అక్కడ ఏమి దొరకక పోవడంతో కుమ్మరి తిరుపతి ఇంట్లో ప్రవేశించి బీరువ తాళాలు పగల కొట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సౌండ్ రావడం వలన తిరుపతికి తెలివి రావడంతో అతను గట్టిగా అరిచాడు దాంతో దుండగులు పారి పోయినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి ధర్మపురి ఎస్సై కిరణ్ కుమార్ వెంటనే వెళ్లి వేలి ముద్ర నిపుణులను తీసుకొచ్చి ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.