- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో విషాదం చోటు చేసుకుంది. బుట్టాయగూడెం గుబ్బలమంగమ్మ ఆలయం వద్ద కొండవాగులో యువతి గల్లంతైంది. ఆలయం సమీపంలోని ఎర్ర ఎక్కుడు కాల్వ వరద ఉధృతికి మోటార్ సైకిల్ నుండి జారిపడి ఓ యువతి కాల్వలో కొట్టుకుపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి యువతి సోదరుడు తృటిలో తప్పించుకున్నాడు. మరో ఇద్దరు యువకులు సైతం ప్రాణాలతో బయటపడ్డారు. ఏలూరుకు చెందిన అన్నా చెల్లెళ్లు, అతడి స్నేహితులు రెండు మోటార్ సైకిళ్ళపై మొక్కు తీర్చుకోవడానికి గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చారు.
కాల్వదాటుతుండగా వెనుక కూర్చున్న యువతి కాల్వలో పడి గల్లంతైంది. యువతి గల్లంతు అయిన సమాచారం తెలుసుకున్న బుట్టాయిగూడెం పోలీసులు, ఆలయ కమిటీ యువతి కోసం గాలిస్తున్నారు. కళ్లెదుటే తన సోదరి కాల్వలో పడిపోవడంతో యువతి సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
Advertisement
Next Story