- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కానిస్టేబుల్ అయి ఉండి నన్నే ఆపుతావా.. బైకర్ హల్ చల్
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ వాహనదారుడు రోడ్డుపై హల్ చల్ చేస్తూ రెచ్చిపోయాడు. హెల్మెట్ లేదని వాహనాన్ని అడ్డుకున్న పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా.. నన్నే అడ్డుకుంటారా అంటూ చిందులు తొక్కాడు. కానిస్టేబుల్ స్థాయిలో ఉండి నన్నే ఆపుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
యువకుడు జిల్లాలోని చన్‌పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, బైకు డ్రైవింగ్ చేసే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు పదే పదే హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే.
Next Story