- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగచాటుగా దేశం దాటి… దుబాయ్‌లో చిక్కుకుని
దిశ, జగిత్యాల: ఐదేండ్ల క్రితం ఓ యువకుడు దొంగచాటుగా దేశం దాటి.. దుబాయ్ వెళ్లాడు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన జంగిలి పెద్దులు కొందరి మాటలు నమ్మి, ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. కరోనా మూలంగా అందరూ స్వదేశాలకు వెళ్తుండగా, పెద్దులు స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కాగా పెద్దులు సమస్య తెలిసిన దుబాయ్ కాన్సులేట్ పెద్దులుకు తాత్కాలిక పాస్ పోర్టు ఇప్పించారు.
అంతేగాకుండా అక్కడ పెద్దులుకు సామాజిక సేవకుడు జైత నారాయణ సహకరించారు. భారతీయ పౌరుడు అని నిరూపించే పత్రాలను ఇండియా నుంచి ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి పంపించారు. కరోనా నేపథ్యంలో ఇటీవల యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం ద్వారా ఇండియాకు చేరాడు. ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చిన పెద్దులు మీడియాతో మాట్లాడుతూ… మెరుగైన ఉద్యోగ అవకాశాలుంటాయన్న మాటలు నమ్మి అక్రమంగా దేశ సరిహద్దులు దాటడం తాను చేసిన పొరపాటని, ఈ విధంగా ఎవరూ చేయకూడదని అన్నాడు.