- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టు కోసం నాలుగు రోజులు అలా… చివరికి ఇలా..
దిశ, నాగర్ కర్నూల్: నాలుగురోజులుగా కారోనా పరీక్షలు జరపాలని తిరుగుతూ ఆరోగ్యం విషమించి యువకుడు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తుడుకుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిసిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఆవుల గంగాధర్ (33) గత వారంరోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో సాధారణ జ్వరం అనుకొని మందులు వాడుతున్నాడు. అయితే తగ్గకపోవడంతో నాలుగు రోజుల నుండి కరోనా పరీక్షల కొరకు నాగర్ కర్నూల్ తో పాటు చూట్టుప్రక్కల గల కోవిడ్ సెంటర్లకు తిరిగాడు. అయినా ఎక్కడ కూడా కరోనా పరీక్ష నిర్వహించకపోవడంతో చివరకు మంగళవారం ఆరోగ్యం మరింత విషమించడంతో.. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఉండడాన్ని గమనించి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా కరోన పాజిటివ్ అని తేలింది. దీంతో ఉదయం 2 గంటల సమయంలో అతడు మృతి చెందాడు. కారోనా పరీక్షలు నిర్వహించి ఉంటే మందులు వాడితే తగ్గేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.