- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీన్ రివర్స్.. వీసాకు బదులు విడాకులు.. భార్య కంత్రీ ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్ : భార్యభర్తలంటే ఓ నమ్మకం. ఎవరిని ఎవరు నమ్మకపోయినా ఆ సంసారం నిలవడం కష్టం. ఓ భర్త తను విదేశాలకు వెళ్లాలనే కలను భార్య ద్వారా సాకారం చేసుకోవాలని కలలుకన్నాడు. లక్షలు ఖర్చు చేసి ఆమెను విదేశాలకు పంపి.. తాను మాత్రం పోలీస్ స్టేషన్‌లో దీన అవస్థలో కూర్చుకున్నాడు. తనను తన భార్యా మోసం చేసిందని కేసు వేశాడు. పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
లూథియానాకు చెందిన జస్కరణ్ సింగ్ విదేశాలకు వెళ్లి స్థిరపడాలి అనుకున్నాడు. ఇందులో భాగంగా కెనడా వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే విదేశాల్లో స్థిరపడాలి అనుకున్న వాళ్లు తప్పనిసరిగా ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్(ఐఈఎల్‌టీఎస్) టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది. ఆ సామర్థ్యం లేని వారు బాగా చదువుకునే అమ్మాయిలను పెళ్లి చేసుకుని స్టడీ వీసా మీద విదేశాలకు పంపించి, ఫ్యామిలీ వీసాపై వీళ్లు వెళ్తారు. ఇక్కడే మోసం జరిగింది.
విదేశాలకు వెళ్లాలన్న కాంక్షతో జస్కరణ్ సింగ్ 2018లో గుర్లీన్ కౌర్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే కెనడా వెళ్లే ప్లాన్ ను వివరించి ఆమెతో, వారి కుటుంబ సభ్యులతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. వివాహం తర్వాత పూర్తిగా తన ఖర్చులతోనే స్టడీ వీసాతో కెనడా పంపిస్తానని, అక్కడికి వెళ్లాక ఫ్యామిలీ వీసాపై తనను అక్కడికి తీసుకెళ్లాలనే షరతులతో ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే జస్కరణ్ సింగ్ తన భార్యను కెనడా పంపించాడు.
కానీ ఆమె అక్కడికి వెళ్లాక మాట మార్చింది. నాకు నువ్వంటే ఇష్టం లేదని, విడాకులు తీసుకుందాం అని వీసాకు బదులు డైవర్స్ నోటీసులు పంపించింది. దీంతో షాక్ తిన్న జస్కరణ్ సింగ్ భార్య కుటుంబ సభ్యులను ఆశ్రయించాడు. వారి నుంచి కూడా సమాధానం లేకపోవడంతో తన భార్య మోసం చేసిందని గుర్లీన్, ఆమె కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై లూథియానా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చరణ్‌జీత్ సింగ్ స్పందించారు. పంజాబ్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారని, కొందరు అక్కడకు వెళ్లాక మాట మార్చి ముందు అనుకున్న షరతును ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. గత కొంతకాలంగా ఈ తరహ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.