తెలంగాణను అభినందించిన కేంద్రం

by Shamantha N |
తెలంగాణను అభినందించిన కేంద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి స్వనిధి (పీఎం స్వనిధి) పథకాన్ని అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు రుణాలు అందజేయడంతో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా అభినందనలు తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో గ్రామీణ గృహనిర్మాణం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పీఎం స్వనిధి, పలు మౌళిక వసతుల ప్రాజెక్ట్‌ల పై ప్రధానమంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన రాష్ట్రంలో 5,88,099 వీధి వ్యాపారులను గుర్తించి ఇందులో 72 శాతానికి అంటే 4,29,250 రుణ దరఖాస్తులను అప్‌లోడ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,07,279 మంది వీధి ప్యాపారులను రుణాలు మంజూరు చేయగా, ఇప్పటి వరకూ 1,76,628 రుణాలను అందించారు.

వీధి ప్యాపారులకు సంబంధించి సర్వే చేయడం కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి మూడు నెలల్లోనే వీధి వ్యాపారుల వివరాలు నమోదు చేశారు. వీధి వ్యాపారుల్లో 602.91 శాతం పెరుగుదల కనిపించింది. వీధి వ్యాపారులకు యూపీఐ ఐడీల జనరేషన్, క్యూఆర్ కోడ్ జారీ కోసం డిజిటల్ పేమెంట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ , ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కార్మిక శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్ , ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed