- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఆక్సిజన్ ప్లాంట్లు ఓపెన్ చేయండి.. రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు
by vinod kumar |

X
న్యూఢిల్లీ: ఆక్సిజన్ ప్లాంట్‌ల లిస్టును తయారుచేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏవైనా మూసి ఉంటే వాటిని తిరిగి ఓపెన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆక్సిజన్ సరఫరాపై ఆటంకాలు కలిగించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని చోట్ల అటువంటి ఘటనలు పునరావృతమైనట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలను నివారించాలని తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సమీక్షించారు. దేశంలోని చాలా జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయని, అవన్నీ మెడికల్ అవసరాల కోసం ఉద్దేశించబడినవి కావని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన ప్రత్యేక లేఖలో పేర్కొన్నారు. అలాంటి ఆక్సిజన్ ప్లాంట్‌లను మెడికల్ అవసరాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Next Story