నేటితో టీఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్లు

by Shyam |   ( Updated:2020-04-26 20:57:28.0  )
నేటితో టీఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్లు
X

తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్)కి నేటితో 20 ఏళ్లు నిండాయి. దీంతో సోమవారం తెలంగాణ భవన్‌లో ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ జెండావిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆర్భాటాలు చేయకుండా, నిరాడంబరంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు తమ తమ ఇండ్లపైనే గులాబీ జెండాను ఎగరవేయాలని సూచించారు. భౌతికదూరం పాటిస్తూ.. రక్తదాన కార్యక్రమాలు చేయాలన్నారు. చుట్టు పక్కల ఉన్న పేదలకు ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Tags : TRS party, 20 years, today, telangana bhavan, cm kcr, ktr

Next Story

Most Viewed