ఆర్డర్ చేసింది చికెన్ ఫ్రై.. వచ్చింది చూస్తే షాక్

by Shamantha N |   ( Updated:2021-06-05 00:25:41.0  )
ఆర్డర్ చేసింది చికెన్ ఫ్రై.. వచ్చింది చూస్తే షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఏదీ కావాలన్నా.. అర్డర్ చేస్తే క్షణాల్లో మనముందు ఉంటుంది. దీంతో చాలామంది మార్కెట్లకు వెళ్లకుండా ఇంటి నుంచే ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకుంటున్నారు. అలాగే మహిళలు కూడా ఇంట్లో వంట చేయడం కుదరకపోతే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇలా ఆర్డర్లలో కూడా.. ఒకటి ఆర్డర్ చేస్తే మరోకటి రావడం కామన్ అయిపోయింది. అయినా చాలా మంది ఆర్డర్లు పెట్టుకుంటూనే ఉంటున్నారు. అయితే అలానే అలిక్ పెరెజ్ అనే మహిళ ఫుడ్ డెలివరీ పోర్టల్ నుంచి ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. జొల్లిబీ రెస్టారెంట్ నుంచి ఇంటికి పార్సిల్ వచ్చింది.

అది రాగానే ఎంతో ఆశగా ఆ చికెన్ తీసి తన కొడుకుకు తినిపించాలని కవర్ ఓపెన్ చేసి పీస్ కట్ చేసింది. అది ఎంతకూ కట్ కావడం లేదు. దీంతో ఎందుకు పీస్ కట్ కావడం లేదని తన భర్తను పిలిచింది. అతను వచ్చి కవర్ మొత్తం ఓపెన్ చేస్తే ఫ్రై చేసిన టవల్ కనిపించింది. దీనిని చూసిన పెరెజ్ కోపం కట్టలు తెంచుకుంది. జొల్లిబీ రెస్టారెంట్ చేసిన పనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. దీనిపై సదరు రెస్టారెంట్ స్పందించింది. జరిగిన తప్పిదంపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది.

Advertisement

Next Story