ఘోరం.. తల్లి పై కత్తితో దాడి చేసిన కొడుకు..

by Sumithra |   ( Updated:2021-12-14 04:06:55.0  )
mother killed daughter
X

దిశ శంషాబాద్: అర్ధరాత్రి కన్నతల్లి, తమ్ముడు పై అన్న కత్తితో దాడి చేసిన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్ గూడా లో నివాసం ఉండే స్వరూప కు సంపత్ రెడ్డి, సందీప్ రెడ్డి అనే ఇద్దరు కుమారులున్నారు. గత కొన్ని రోజులుగా సంపత్ రెడ్డి కి మతిస్థిమితం సరిగా లేక ఎర్రగడ్డలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.

అయితే కొడుకు చికిత్స పూర్తి కాకుండానే స్వరూప ఇంటికి తీసుకువచ్చింది. ట్రీట్మెంట్ పూర్తిగా తీసుకోకపోవడంతో ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేయడం చుట్టుపక్కల వారిని కొట్టడం చేసేవాడు. అదే క్రమంలో సోమవారం రాత్రి కత్తితో తల్లి స్వరూప తో పాటు సోదరుడు ప్రదీప్ రెడ్డి పై దాడి చేశాడు. దాంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన సంపత్ రెడ్డి ని అదుపులోకి తీసుకొన్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed