- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Big Rain Alert : ఏపీకి బిగ్ అలర్ట్.. రేపు వడగళ్ళ వర్షం
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి బిగ్ అలర్ట్(BIG Alert for AP) ప్రకటించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA). సోమవారం ఏపీలో పలు చోట్ల వడగళ్ళ(Hailstroms)తో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులు, భారీ ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
ఇక మిగతా జిల్లాల్లో మాత్రం తీవ్రమైన ఎండలు(Heatwave) ఉంటాయని తెలియజేశారు. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉన్నందున.. మధ్యాహ్నం వేళ ప్రజలు ఎవరూ ఇళ్ళనుంచి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి రేపు ఏపీలో రెండు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నమోదు కాబోతున్నాయి.
Next Story