- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమాన ప్రమాదంలో అదే కీలకం
దిశ, వెబ్‌డెస్క్: కేరళను వరస ప్రమాదాలు కుదిపేస్తున్నాయి. ఓవైపు కరోనా.. మరోవైపు భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో మృతిచెందారు. ఇది చాలదన్నట్లు శుక్రవారం రాత్రి కోళీకోడ్ ఎయిర్ పోర్ట్ (Airport)లో విమానం ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది అశువులుబాశారు. మృతుల్లో పైలట్, కో-పైలట్ ఉండడంతో ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే విమానం టేకప్ నుంచి ల్యాండింగ్ వరకు పైలట్, కోపైలట్ సంభాషణలన్ని బ్లాక్ బాక్స్ (Black Box)లో రికార్డు అవుతాయి. విమాన శకలాల్లో అధికారులు దానిని గుర్తించారు.
విమాన ప్రమాదాల్లో ముఖ్యంగా డిజిటల్ ఫ్లైట్ రికార్డర్ (DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR)చాలా కీలకం. ఈ రెండు విమానం (Aircraft) టేకప్ నుంచి ల్యాండింగ్ వరకు ఎలా వెళ్లింది?, ఏ రూట్లో ప్రయాణించింది? పైలట్ల సంభాషణ, ప్రయాణికులతో ఏం మాట్లాడారు.. ఇలా ప్రతి అంశాన్ని రికార్డు చేస్తాయి. పైలట్లు ప్రమాదాన్ని ముందే పసిగడితే వారు ప్రయాణికులకు ఏం హెచ్చరికలు చేశారు?, వాళ్లు ఎయిర్ పోర్ట్ అధికారులకు ఏం సందేశాలు పంపించారో వాటిల్లో పూర్తిగా నిక్షిప్తమై ఉంటాయి. విమానం
అగ్నిప్రమాదానికి గురైనా ఈ బ్లాక్ బాక్స్ చెక్కుచెదరని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో డీఎఫ్డీఆర్, సీవీఆర్ బాక్స్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ద్వారా ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తు నుంచి ఎంత వేగంగా రన్‌వే పైకి దిగింది, ఏ పొజిషన్లో ల్యాండ్ అయింది, రన్‌వే పై ఎంత వేగంతో పరుగులు తీసిందో విశ్లేషించనున్నారు. దీని ద్వారా ప్రమాదానికి కారణాలను డీజీసీఏ అధికారులు గుర్తించనున్నారు. దాని తర్వాత మరో ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.