- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చై-సామ్ విడిపోడానికి కారణం అదే అంటున్న అభిమానులు
దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లే ఇప్పుడు నిజమయ్యాయి. అభిమానులు ఏం జరగకూడదనుకున్నారో అదే జరిగింది. ఏ మాయ చేశావే సినిమాతో ప్రేమలో పడి ఒకటైన ఈ జంట నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండి మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా పేరు సంపాదించుకుంది. వారి పెళ్లి అని తెలియగానే ఎంతో సంతోషించిన అభిమానులకు ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ జంట అభిమానులు ఈ విషయంపై పరిపరివిధాల తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా కొంత మంది అసహనం వ్యక్తం చేయగా, మరికొంత మంది వారి నిర్ణయానికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అయితే, వీరి వివాహ బంధం ఇంత తొందరగా ముగింపు పలకడానికి కారణం సమంత రీసెంట్ గా తీసిన ది ఫ్యామిలీ మాన్ 2 కారణమని అక్కినేని అభిమానులు అంటున్నారు. ఆ సినిమాలో సమంత యాక్టింగ్‌కు మంచి మార్కులే పడినా, మితిమీరిన కొన్ని సీన్లలో నటించడం వల్లే నాగచైతన్య సమంత మధ్య భేదాభిప్రాయాలు రావడానికి కారణమయ్యాయని చెప్పుకుంటున్నారు.
నాగార్జున, అమల పెళ్లి తర్వాత అమల అక్కినేని కుటుంబ కట్టుబాట్లలో ఉంది. కానీ, సమంత సినిమాలు చేయడంపై అక్కినేని ఫ్యామిలీ ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అయినా సమంత ఇలా చేయడం సరికాదంటూ సీజన్ వచ్చినప్పుడే అనేక రూమర్లు వచ్చాయి. ఏదేమైనా ఎంతో అన్యోన్యంగా ఉంటుందనుకున్న జంట ఇలా హఠాత్తుగా విడిపోవడం మాత్రం అందరికీ షాకింగ్ గురి చేసింది.