- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్కుమారస్వామి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని, వారి డబ్బుకు భరోసా ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు సంక్షేమ పథకాలు దూరమవుతాయన్నారు. ప్రతీ ఉద్యోగి బ్యాంకు ఉద్యోగులకు మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ జి.నిర్మల, కోశాధికారి గడ్డం బాలస్వామి, సభ్యులు ఆనంద్ యాదవ్, సైఫా బేగం, రాజేశ్వరి, దేవకి పాల్గొన్నారు.
Advertisement
Next Story