2025-26:ఇంటర్ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-04-04 04:57:35.0  )
2025-26:ఇంటర్ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ బోర్డు(Telangana Inter Board)కీలక ప్రకటన చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పనిదినాలు, తరగతులు, సెలవులు(Holidays), పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య(Inter Board Secretary Krishna Aditya) గురువారం కొత్త అకడ‌మిక్ క్యాలెండ‌ర్‌(New academic calendar)ను విడుదల చేశారు.

రాష్ట్రంలో జూనియర్ కాలేజీల(Junior College)కు సంబంధించిన 2025-26 సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం కానుండగా మొత్తం 226 పనిదినాలు ఉండనున్నాయి. విద్యార్థులకు నవంబర్ 10 నుంచి 15 వరకు అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఫ్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇక కాలేజీలకు చివరి వర్కింగ్ డే మార్చి 31వ తేదీ గా పేర్కొన్నారు.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పండుగ సెలవులు ఎప్పుడంటే..

దసరా సెలవులు: సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు.

సంక్రాంతి సెలవులు: జనవరి 11 నుంచి 18 వరకు.

వేసవి సెలవులు: ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు.

తరగతులు ప్రారంభం: మళ్లీ పున:ప్రారంభం 2026 జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం తరగతులు మొదలవుతాయి.

Next Story